రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన శంకర్, కమల్ హాసన్..  Kamal Haasan
2019-09-19 13:40:16

అదేంటి.. కమల్‌ హాసన్‌, శంకర్ ఎందుకు జైలుకు వెళ్లారు.. వాళ్లేం తప్పు చేసారు.. పైగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? అవును నిజంగానే వీళ్లు ఇప్పుడు జైలుకి రాబోతున్నారు. కాకపోతే సినిమా కోసమే.. ఇదంతా నిజం మాత్రం కాదు. ప్రస్తుతం శంకర్‌ ఇండియన్ 2 సినిమా తెరకెక్కిస్తున్నాడు. 20 ఏళ్ళ కింద వచ్చిన సినిమాకు ఇది సీక్వెల్. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను బట్టి ఈ కథ రాసుకున్నాడు శంకర్. లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఎప్పుడో మొదలవ్వాల్సిన షూటింగ్ అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పుడు వేగంగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తున్నాడు శంకర్. చెన్నైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన ఈ దర్శకుడు.. తర్వాతి షెడ్యూల్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో జరగనుంది. అందుకే సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న నటీనటులతో పాటు శంకర్ కూడా అక్కడే ఉండబోతున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి ఈ షెడ్యూల్ మొదలు కానుంది. అక్కడే కొన్ని రోజుల పాటు రెగ్యులర్‌గా షూటింగ్‌ జరగనుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తర్వాత ఫారెన్ వెళ్లనున్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళా సాధికారిత అంశాలపై భారతీయుడు 2 కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులోనే ప్రస్తుత రాజకీయాలు కూడా చర్చించబోతున్నాడు శంకర్. రత్నవేలు కెమెరామేన్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి అనిరుద్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి చూడాలిక.. ఇండియన్ 2 ఎలా ఉండబోతుందో..? 

More Related Stories