సేనాపతి ఈజ్ బ్యాక్...లీకయిన పిక్స్ వైరల్ Kamal Haasan
2019-10-24 19:16:40

కమల్ హాసన్ కెరీర్ లోనే విలక్షణ సినిమాగా నిలిచింది భారతీయుడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ప్రస్తుతం కోట్ల ఖర్చుతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ సినిమా షూట్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. నిజానికి ఈ లుక్ విషయంలో శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమల్ లుక్ బయటకి వెళ్ళకుండా సెట్ లో ఫోన్స్ కూడా అలో చేయడం లేదట. కానీ నిన్నకమల్ కి మేకప్ వేస్తున్నప్పటి పిక్ అలాగే ఆయన గుర్రం మీద స్వారీ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో లీకయి వైరల్ గా మారాయి. 

ఈ వైరల్ అయిన పిక్స్ లో కమల్ హాసన్ సేనాపతి గెటప్ లో ఓ గుర్రంపై వెళుతున్నారు. అది కూడా మార్కెట్ వీధుల్లో గుర్రంపై స్వారీ చేస్తున్నాడు సేనాపతి. అయితే పక్కన ఉన్న బళ్ల మీద నంబర్స్ ని బట్టి, వెనక ఉన్న బారికేడ్స్ ని బట్టి ఈ షూట్ ప్రస్తుసం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరుగుతున్నట్టుంది. ఇక భారతీయుడు మొదటి భాగంలో సేనాపతి లుక్ వేరు ఇప్పటి లుక్ వేరు. భారతీయుడు మొదటి భాగం కంటే ఈ లుక్ లో ఇంకా ముసలిగా కనిపిస్తున్నారు. 

భారతీయుడు సినిమాలో లాగానే ఇందులో కూడా కమల్ హాసన్ యువకుడిగా, అలాగే వయసు మళ్ళిన వృద్దుడిగా రెండు గెటప్స్ లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని భాస్కర్ సిద్దార్ధ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

More Related Stories