పాపం ప్రశాంత్ నీల్..వాళ్ళు ఆడుకుంటున్నారు prashanth neel
2020-05-22 17:31:33

 ఆ సినిమా ముందు వరకూ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఏ ముహూర్తాన అయితే కేజీఎఫ్ ను రిలీజ్ చేసారో ఆనాటి నుండి యష్ తో పాటు ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ పేరు కూడా గట్టిగానే వినపడింది. అయితే సడన్ గా ఈయన తెలుగు సినిమా దర్శకత్వం వహిస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరగగా ఆ విషయం మీద నిన్న క్లారిటీ ఒచ్చేసింది. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ అదే ట్వీట్లో ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీంతో ఒకరకంగా ఎన్టీఆర్ అభిమానులు గాల్లో తేలిపోయారు. మొత్తానికి నూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్ ని వెసుకొస్తాను పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొనడంతో తమ హీరోను నూక్లియర్ పవర్ ప్లాంట్తో పోల్చడంతో అభిమానులు గాల్లో తేలుతూ ప్రశాంత్ ను కూడా ఒక రేంజ్ లో గాల్లో లేపారు తమ ట్వీట్స్ తో. 

అయితే తెలుగు అభిమానులు ఆయన్ను మెచ్చుకుంటుంటే కన్నడ అభిమానులు మాత్రం వారిని ఆడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. మన కన్నడ హీరోతో ఒక సినిమా చేసి ఇంత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు ఆ క్రేజ్ ని తెలుగు సినిమా కోసం వాడతావా ? అంటూ వారు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. రాజమౌళి, శంకర్ లాంటి వాళ్లే వాళ్ల హీరోలతో తప్ప బయట హీరోలతో చెయ్యట్లేదని కానీ ఒక్క సినిమా హిట్ కొట్టాక పక్క హీరోతో ఎలా చేస్తావని ప్రశ్నిస్తున్నారు. మరి మన మెహర్ రమేష్, పూరీ లాంటి వాళ్ళు అక్కడి హీరోలతో తీసి హిట్స్ కొట్టినప్పుడు ఈ బ్యాచ్ అంతా ఏమయ్యారో ?  

More Related Stories