కంగన రనౌత్ ఆ రీమేక్ చేస్తుందా.. నగ్నంగా నటిస్తుందా..?kangana
2019-10-23 05:21:41

బాలీవుడ్ హీరోయిన్లలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్సియల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే మరో ఆలోచన లేకుండా కంగన పేరు ముందు చెప్పాల్సిందే. ఎందుకంటే ఆమె నటించినా.. విమర్శించినా అన్ని పక్కాగా చేస్తుంది. అందుకే మూడు నేషనల్ అవార్డులు ఆమె ముందు వాలాయి. ఇక ఇప్పుడు ఈమె ఓ రీమేక్ సినిమా చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట రత్నకుమార్ తెరకెక్కించిన ఆడై సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం విక్రమ్ భట్ భారీ ఆఫర్ ఇచ్చి మరీ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని తెలుస్తుంది.

త్వరలోనే ఈ చిత్ర రీమేక్ మొదలు కానుందని రత్నకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అమలాపాల్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రం చేయాలంటే కంటెంట్ కంటే ముఖ్యంగా హీరోయిన్ నగ్నంగా ఉండాలి. సినిమా అంతా అదే సంగతి. అమలాపాల్ ఇదే చేసింది. ఈమె సినిమాలో దాదాపు సగానికి పైగా నగ్నంగా నటించింది. ఒక దక్షిణాది కథానాయిక ఇలాంటి పాత్ర చేయడం సంచనలమే. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి అమలా ఇది చేసింది. మరి ఇప్పుడు కంగన కూడా ఇదే చేస్తుందా.. ఆమె కథ నచ్చితే ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు నిజంగానే బోల్డ్ కారెక్టర్ చేయబోతుందా అనేది చూడాలి.

More Related Stories