జయలలిత వర్ధంతి.. తలైవి కొత్త లుక్ విడుదల చేసిన దర్శక నిర్మాతలు..



Kangana Ranaut
2020-12-05 14:03:03

ఇప్పుడు తెలుగులోనే కాదు దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన లెజెండ్స్ జీవితాలను ఇప్పుడు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి కొత్త‌గా క‌థ కూడా రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఉన్న క‌థ‌ను కాస్త మార్చి చెబితే స‌రిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి బయోపిక్స్ వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయ్యింది. సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తమిళనాట కూడా ఒక భారీ బయోపిక్ సిద్ధ‌మ‌వుతుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి దివంగత నేత జయలలిత బయోపిక్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అమలాపాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో కంగ‌న ర‌నౌత్ హీరోయిన్. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి తమిళనాట జయలలిత బయోపిక్ తలైవి సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. జయలలిత గత వర్ధంతికి చిన్న టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ డిసెంబర్ 5 అమ్మ వర్ధంతిని పురస్కరించుకొని  మరొక వీడియో విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్ ఫైల్స్ పట్టుకుని సీరియస్ గా నడుస్తుంది. జి.వి.ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం అందిస్తుండగా నీర‌వ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. 100 కోట్ల‌తో జయలలిత బయోపిక్ తెరకెక్కించబోతున్నాడు ఏ ఎల్ విజయ్. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో కూడా ఈ చిత్రం విడుద‌ల కానుంది. అన్ని ఇండ‌స్ట్రీల్లో వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావిస్తున్నాడు విజ‌య్. అందుకే భారీ బ‌డ్జెట్ పెట్టిస్తున్నాడు. ఇప్పటికే జయలలిత కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు దర్శకుడు. మొత్తానికి మరి జయలలిత బయోపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More Related Stories