అమీర్‌ ఖాన్‌ విడాకులపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు Aamir Khan
2021-07-07 00:48:28

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ తన భార్య కిరణ్‌ రావ్‌ నుంచి విడాకులు తీసుకున్నట్లు రెండు రోజులు క్రితం ప్రకటించినప్పటి నుంచి .. ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. నెట్టింట సెటైర్లు, ట్రోలింగ్‌లతో ఈ విషయంపై రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పంజాబ్ లోని చాలా కుటుంబాలు ఒకకొడుకును హిందువుగా.. మరొక కొడుకును సిక్కుగా పెంచేవాళ్లు. అయితే ఈ ఆచారాన్ని హిందువులు ముస్లింలు సిక్కులు ఎవరూ పెద్దగా చూడలేదు. కానీ అమీర్ ఖాన్ సర్ రెండోసారి విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన పిల్లలు మాత్రం ఎందుకు ముస్లింగా గుర్తించబడుతారనేది ఒక ఇంటర్ ఫెయిత్ వివాహంలో చూసి నేను ఆశ్చర్యపోయాను. స్త్రీ ఎందుకు హిందువుగా కొనసాగకూడదు.. మారుతున్న కాలంతో మనం మార్చాలి. ’ అని మతాలను తీసుకొచ్చి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఇతర మతస్థులు జీవించినట్టే.. ముస్లింలు ఎందుకు జీవించరు? ముస్లింలను వివాహం చేసుకోవడానికి మరొకరు ఎందుకు మతం మార్చుకోవాలి? అంటూ కంగన ప్రశ్నించారు.
 

More Related Stories