విషాదం.. 44 ఏళ్లకే కన్నుమూసిన స్టార్ కమెడియన్..comedian
2020-04-07 14:26:53

ఎప్రిల్ 6 ఎందుకో కానీ సినిమా ఇండస్ట్రీకి అంతగా కలిసిరాలేదు. ఈ ఒక్కరోజే వేర్వేరు ఇండస్ట్రీలలో మూడు చేదు వార్తలు వినాల్సి వచ్చింది. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ్ తల్లి చనిపోయారు.. అలాగే రాజీవ్ కనకాల చెల్లి శ్రీలక్ష్మి కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ కూడా మరణించాడు. ఈయన వయసు కేవలం 44 ఏళ్లు మాత్రమే. కొన్ని రోజులుగా ఈయన కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు బుల్లెట్ ప్రకాశ్. ఈయన మరణవార్త తెలుసుకుని కన్నడ ఇండస్ట్రీ షాక్ అయింది. మార్చ్ 31న జీర్ణ సంబంధమైన సమస్యతో ఆస్పత్రిలో చేరాడు.. అయితే ఆ తర్వాతే ఆయనకు కిడ్ని, కాలేయ వ్యాధులు ఉన్నాయని తెలిసింది. ఈక్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరికి డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన ప్రాణాలు దక్కలేదు. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్‌.. కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. పునీత్‌ రాజ్‌కుమార్‌, దర్శన్‌, శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, సుదీప్‌ కిచ్చ వంటి బడా హీరోలతో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఈయన మరణం కన్నడ ఇండస్ట్రీకి తీరనిలోటు అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More Related Stories