ప్రముఖ హీరోపై దాడి...రక్తం వచ్చేలా !actor Komal
2019-08-15 08:29:40

ఆయనో కన్నడ హీరో సినిమాల్లో ఎంతో మంది విలన్ లను చితక్కొట్టి ఉంటాడు. అలాంటిది రియల్ లైఫ్ లో తాను ఒకరిచేత కొట్టించుకోవాల్సి వచ్చింది. తాజాగా కన్నడ హీరో కోమల్ మీద బెంగళూరులో తీవ్రదాడి జరిగింది. హీరో కోమల్ తన కుమార్తెను స్కూలును తీసుకురావడానికి కారులో బెంగళూరులోని శ్రీరాంపుర రైల్వే సమీపం నుంచి వెళుతున్నాడు. ఈ సందర్భంగా మల్లేశ్వరం మార్గం మధ్యలో కమల్ కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఓ బైక్ పై వెళుతున్న వ్యక్తి దురుసుగా కారును తాకిస్తూ వెళ్లాడు. దీంతో కోమల్ ఆ బైకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తననే తిడతావా అని ఆగ్రహం వ్యక్తం చేసిన బైక్ పెళుతున్న విజీ అనే వ్యక్తి కోమల్ తో వాగ్వాదానికి దిగడమే కాక దాడి చేశాడు. ముఖం- ముక్కు- నోటిపై పిడిగుద్దులు గుద్దడంతో కోమల్ కు రక్తం కారియింది. 

ఈ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం మీద పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నటుడు కోమల్ మీద దాడి చేసింది శ్రీరాంపురకు చెందిన విజి అని, అతను డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడని తేలింది. కారులో ఉన్న కోమల్ ను రెచ్చగొట్టి ఆయన కిందకు దిగిన తరువాత విజి దాడి చేశాడని, కావాలనే దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కోమల్ సోదరుడు, ప్రముఖ హీరో, బీజేపీ నాయకుడు జగ్గేష్ ఈ విషయంలో ఫైర్ అయ్యారు. తన సోదరుడి మీద దాడి చేసిన వ్యక్తి గంజాయి సేవించాడని, బైక్ లో వెనుక అమ్మాయిని కుర్చోపెట్టుకున్నాడని ఆరోపించాడు. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని జగ్గేష్ డిమాండ్ చేశారు.

More Related Stories