విజయేంద్ర ప్రసాద్ కథకు కరీనా కండిషన్స్



Kareena Kapoor
2021-06-09 10:42:27

దేశంలో గుర్తింపు తెచ్చుకున్న రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. ఎన్నో రికార్డులు సృష్టించిన సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. బాహుబలి, మగధీర, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల కథలు ఆయనవే. అంతే కాకుండా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన బజరంగీ భాయ్ జాన్ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాదే కథను కథని అందించారు. కాగా ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సీత అనే మైతలాజికల్ డ్రామాకు కథను అందిస్తున్నారు. సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు ఒప్పందం చేసుకునే ముందు కరీనా రెండు కండీషన్ లు పెట్టినట్టు తెలుస్తోంది. వాటిలో ఒకటి అప్పటికే తాను సైన్ చేసిన రెండు సినిమాలను పూర్తి చేసాకే ఈ సినిమా షూటింగ్ కు వస్తానని చెప్పిందట. అంతే కాకుండా ఈ సినిమా కోసం కరీనా కపూర్ 12 కోట్ల రెమ్యునరేన్ ను డిమాండ్ చేసిందట. కాగా మేకర్స్ కరీనా రెండు కండిషన్లకు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని రామాయణంలోని సీత పాత్రను హైలెట్ చేస్తూ తీయబోతున్నారని సమాచారం.

More Related Stories