చిరంజీవి హీరోయినా మజాకా.. 40ల్లోనూ అదే ఊపు ఒంపు..act
2020-05-03 02:29:45

చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఒక్క సినిమాతోనే మాయమైపోయిన హీరోయిన్ కరిష్మా కోటక్. కానీ చిరంజీవి హీరోయిన్ గా ముద్ర మాత్రం అలాగే ఉండిపోయింది. 13 ఏళ్ల కింద వ‌చ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఈమె హీరోయిన్. ఆ సినిమా త‌ర్వాత మాయం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె పేరు క‌రిష్మా కోట‌క్ కూడా అని కూడా చాలా మందికి తెలియ‌దు. కేవ‌లం చిరంజీవి హీరోయిన్ అని పిలుస్తుంటారు అంతే. అలా ముద్ర ప‌డిపోయింది ఆమెపై. చిరు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ క్రేజ్ వాడుకోవ‌డంలో ఫెయిల్ అయింది ఈ బ్యూటీ. అందుకే ఆ త‌ర్వాత ఏ సినిమా కూడా చేయ‌లేక‌పోయింది ఈ ముద్దుగుమ్మ‌. లండన్ నుండి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో పాగా వేయ‌డానికి ప్ర‌య‌త్నించినా కూడా ఫ‌లించ‌లేదు.

సినిమాల్లో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో టీవీ రంగం వైపు కూడా వెళ్లింది ఈ భామ‌. అక్క‌డ కూడా సీన్ రివ‌ర్స్ కావ‌డంతో ఇప్పుడు హాట్ ఫోటోషూట్లు చేసుకుంటుంది క‌రిష్మా. ఇప్పుడు కూడా సింగిల్ కాస్ట్యూమ్ వేసుకుని హాట్ ఫోటోషూట్స్ తో మ‌తులు చెడ‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఏజ్ 40 దాటేసినా కూడా ఇప్ప‌టికీ ఈ హాట్ పోజులు చూసి ఫిదా అవుతున్నారు. క‌నీసం ఇలాంటి ఫోటోషూట్లు చూసిన త‌ర్వాతైనా తాను ఉన్నాన‌నే సంగ‌తి ద‌ర్శ‌కుల‌కు గుర్తు వ‌స్తుంద‌ని ఈమె భావిస్తుంది. కానీ అది ఆమె అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. మ‌రి చూడాలిక‌.. ఈ ఫోటోషూట్స్ తో క‌రిష్మా ఎలాంటి మాయ చేయ‌బోతుందో..?

More Related Stories