హీరో యష్ కు కర్ణాటక ప్రభుత్వం షాక్..!Karnataka health department issues showcause notice to actor Yash due to smoking scene in K.G.F. Chapter 2
2021-01-14 15:32:41

కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో వివిధ ఇండస్ట్రీ ల నుండి ప్రముఖులు నటిస్తున్నారు. ఇక ఇటీవల సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేయగా తక్కువ కాలంలోనే 100 మిలియన్ వ్యువ్స్ కు పైగా వచ్చి రికార్డులు తిరగరాసింది. అయితే తాజగా కర్ణాటక ప్రభుత్వం ఈ సినిమాకు ఊహించని షాక్ ఇచ్చింది. టీజర్ లో యష్ సిగరెట్ తాగే సన్నివేశం ఎంతో స్టైలిష్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. 

కానీ ఈ  సన్నివేశాన్ని సినిమా నుండి తొలగించాలని కర్ణాటక ప్రభుత్వం నోటీసులో పేర్కొంది. అంతే  కాకుండా హీరో యష్ కు సైతం నోటీసులు పంపించింది. టొబాకో 2003 చట్టంలోని సెక్షన్ 5 నిబంధనల ప్రకారం పొగ తాగే సన్నివేశాలు ఉండకూడదని..వాటిని తొలగించాలని పేర్కొంది. నిజానికి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో సినిమాల్లో సిగరెట్లు తాగే సన్నివేశాలు ఉంటాయి. కానీ కేజీఎఫ్ 2 టీజర్ లో సిగరెట్ తాగే సీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి కారణం హీరో తుపాకీ పేల్చిన అనంతరం ఆ వేడిపై సిగరెట్ అంటించుకుంటాడు. దాంతో సీన్ హైలెట్ అవ్వడంతో ప్రభుత్వం కంట పడినట్టుంది.

More Related Stories