ఖైదీ కలెక్షన్స్.. 100 కోట్లు కొట్టేసిన కార్తి.. Karthi khaidi
2019-11-13 12:36:03

తోటి హీరోలు అంతా వంద కోట్ల క్లబ్ లో అడుగుపెడుతుంటే ఇన్ని రోజులు కార్తీ మాత్రం చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఆయనకు కూడా టైం వచ్చింది. ఈయన నటించిన ఖైదీ సినిమా  విడుదలైన 18 రోజుల తర్వాత 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఈయన ఖైదీ సినిమా రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ వెళ్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన రెండు వారాల తర్వాత కూడా సినిమా వసూళ్లు అద్భుతంగా వస్తున్నాయి. 

కొత్త కథలు రావాలి.. పాత్ బ్రేకింగ్ సినిమాలు చేయాలి.. అంటూ ఎప్పుడు దర్శక నిర్మాతలు స్టేజీపై చెబుతూ ఉంటారు. హీరోలు కూడా ఇదే మాట రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సినిమాలు.. ఇలాంటి కథలు వస్తే చేయడానికి మాత్రం ధైర్యం సరిపోదు. ఎందుకంటే అలాంటి సినిమాలు కమర్షియల్గా వర్కవుట్ అవుతాయో లేదో అనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కొందరు హీరోలు మాత్రం కేవలం కథను నమ్మి ముందడుగు వేస్తుంటారు. ఇప్పుడు కార్తీ కూడా ఇదే చేసాడు. అలా వచ్చిన సినిమానే ఖైదీ. 

కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న లోకేష్ కనకరాజ్ చెప్పిన చిన్న కథను నమ్మి ఖైదీ సినిమా చేశాడు. ఇది చూసిన తర్వాత ప్రేక్షకులతో పాటు విమర్శకులు ఇండస్ట్రీ వర్గాలు కూడా కార్తీకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేక పోతున్నారు. ఇలాంటి ఒక చిన్న నమ్మి దర్శకుడి ప్రతిభను అంచనా వేసాడు అంటే కార్తీకి ఒక కథను జడ్జిమెంట్ చేయడంలో ఎంత లోతైన పరిజ్ఞానం ఉందో అర్థమవుతుంది. ఒక్క రాత్రిలో అయిపోయే చిన్న కథ ఇది.. అందులోనే కావాల్సినన్ని ఎమోషన్స్ పండించాడు లోకేష్ కనకరాజ్. ఇలాంటి సినిమాలు చేయడానికి హీరోలకు ధైర్యం కావాలి. కార్తీ అది చేసి చూపించాడు కాబట్టే ఖైదీ లాంటి అద్భుతమైన సినిమా బయటకు వచ్చింది అంటున్నారు విశ్లేషకులు. అందరు హీరోలు కూడా ఇలాగే చేస్తే ఇలాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించే దర్శకులు మన దగ్గర పుష్కలంగా ఉన్నారని వాళ్ళు చెబుతున్నారు. తెలుగు తమిళం అనే తేడా లేకుండా ఖైదీ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. 

ముఖ్యంగా ఇందులో కార్తి నటనకు అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఒక కథను కథగా చెబుతూ కమర్షియల్ అంశాల కోసం ఎక్కడా పక్కదారి పట్టకుండా.. పాటలు పెట్టకుండా.. హీరోయిన్ లేకుండా కేవలం స్క్రీన్ ప్లేను నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇప్పుడు ఆయన దర్శకత్వ ప్రతిభకు కూడా సలాం చెబుతున్నారు ప్రేక్షకులు. 18 రోజుల్లో 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగులో కూడా దాదాపు 7 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఖైదీ.

More Related Stories