చావు కబురు చల్లగా చెబుతున్న కార్తికేయKarhtikeya
2020-02-13 21:15:46

ఆర్‌ఎక్స్‌100 సినిమాతో టాలీవుడ్‌ లో యువ హీరోగా ముద్ర వేసుకున్నారు కార్తికేయ. ఆ సినిమా నుండి వైవిధ్యభరితమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఇప్పుడు వెరైటీ టైటిల్‌, కొత్త గెటప్‌ అంతకన్నా వెరైటీ కధతో మనముందుకు వస్తున్నాడు కార్తికేయ. ఆ సినిమానే 'చావుకబురు చల్లగా'.

 గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఈరోజు మొదలైంది. కౌశిక్‌ అనే యువదర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఇక కార్తికేయ లుక్ కి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ము లాగుతూ  కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో ఆయన వున్నాడు. మరి ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడో లేదో చూడాలి.

More Related Stories