మంచి కిక్కిచ్చే సినిమాతో కార్తికేయkarthekeya
2019-09-05 21:32:11

ఆర్ఎక్స్ 100 సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు రాబడి తెచ్చిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ - డైరెక్టర్ కి కూడా పేరు తెచ్చి పెట్టింది. ఆ తరువాత కార్తికేయ నుంచి చకచకా సినిమాలు వచ్చినా, అవి ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. ఈ మధ్య వచ్చిన గుణ 369 సినిమా ఫర్వాలేదనిపింసింది. ఇక తాజాగా కార్తికేయ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'ఆర్ ఎక్స్100' సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇక ఒక రకంగా ఇది కార్తికేయ సొంత బ్యానర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆయన కార్తికేయ సొంత బాబాయ్ కాబట్టి.
ఇక ఈ సినిమాతో శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చనున్న ఈ సినిమా నుంచి త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.  నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించగా ఆ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు నుండి ఈ సినిమాకు ’90 ML’ అనే టైటిల్ ను అనుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పోస్టర్ కూడా అలానే ఉంది. చూద్దాం మరి టైటిల్ ఏంటో ?

More Related Stories