రివ్యూ.. మెప్పించిన కఠారి కృష్ణ!katari krishna
2021-12-11 21:20:16

జాగో స్టూడియో బ్యానర్ పై  పి. ఎ.నాయుడు నిర్మాత నిర్మించిన చిత్రం "కఠారి కృష్ణ". ఈ చిత్రానికి ప్రకాష్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, చాణక్య హీరోలుగా, రేఖా నిరోషా యశ్న చౌదరి, స్వాతి మండల్ హీరోయిన్స్ గా నటించారు. మిగతా పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, చంద్ర శేఖర్ తిరుమలశెట్టి, TNR, మిర్చి మాధవి, D.S RAO తదితరులు  ప్రధాన పాత్ర దారులు పోషించారు. ఇందులోని  కాలభైరవాస్టకం  పాట మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం ట్రైలర్ కి సుమారు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దాంతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రలతో పాటు ఇతర దేశాల్లో కూడా చాలా డిఫరెంట్  ప్రొమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చుద్దాం పదండి.       


 కథ: స్కూల్ లో చిన్న పిల్లల మధ్య ర్యాంక్ పోటీలతో  వేద అమ్మ ( మిర్చి మాధవి ) ఓదార్పుతో టైటిల్స్  స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసాడు డైరెక్టర్. కఠారి కృష్ణ కన్స్ట్రక్షన్  ఎండీ కృష్ణ తన భార్య గతం కోల్పోయి హాస్పిటల్ లో ఉండగా  కృష్ణ ఏంట్రీ తో సినిమా మొదలవుతుంది. డాక్టర్ మురళి కృష్ణ (పోసాని కృష్ణ మురళి ) సహాయంతో భార్య( శ్రీవల్లి )గతo పోవడానికి గల కారణం అయిన వ్యక్తులను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో సత్య పాత్ర రాకతో మరో మెట్టు ఎక్కుతుంది కధ..  శ్రీవల్లి ఇంటిలో ఉండగా సత్య కృష్ణ మధ్య వచ్చే ఫైట్స్ డబుల్ ట్విస్ట్ లు ప్రత్యేక ఆకర్షణ గా నిలవడమే కాకుండా సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయి. వేద, గాయత్రి, శ్రీవల్లి, పెద్దయాక కూడా వారి మధ్య ర్యాంక్ పోరు అలాగే కొనసాగుతున్నా... అదే సమయంలో వేద చనిపోవడానికి కారణం వేదని.. సత్య, శ్రీవల్లి కలిసి చంపేశారు. అ సమయంలో  కృష్ణకి తెలిసిన నిజంతో  ఎవరు చంపారో తెలుసుకునే ప్రాసెస్ లో ఎన్నో మలుపులతో సినిమా వేగం ప్రతి పది నిముషాలకు ఉత్కంట భరితంగా సాగుతుంది. వేద చావుకి కారణం ఎవరు? శ్రీవల్లి గతం కోల్పోవడానికి, గాయత్రి పిచ్చిది అవ్వడానికి కారణం ఎవరు? ఇదంతా ఎవరు చేశారు? ఈ మిస్టరీని కృష్ణ, చాణక్య  ఎలా కనిపెట్టారు? వారి భరతం ఎలా పట్టారు? అనేది మిగతా కధ...                           
కధ... కధనం... విశ్లేషణ : ప్రతి కుటుంబంలో చదువులు చాలా అవసరం. ఆ చదువుల మధ్య వచ్చే ఆహంకారంతో జీవితాలు ఎలా పోగొట్టుకుంటున్నారు అనే మెసేజ్ ఇవ్వడానికి "కఠారి కృష్ణ " ఓ చక్కటి ఉదాహరణ... ఇందులో హీరో కఠారి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డర్ గా  మరొక హీరో సత్య సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గా హీరోయిన్స్ మధ్య ఇగో వలన కృష్ణ ఎలా బలి అయ్యాడు.. కృష్ణ వేద మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ... సత్య  గాయత్రి మధ్య వచ్చే  రొమాంటిక్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ప్రీ క్లెయిమాక్స్ లో చందు పాత్ర తో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్  నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది. గాయత్రి గెటప్ చాలా ఆకర్షణగా, వేద చాలా గ్లామర్స్ గా  పోసాని డాక్టర్ గా, టీఎన్ఆర్ విలన్ గా, డీ. ఎస్ రావు డీఎస్పీగా, మిర్చి మాధవి హీరోయిన్ తల్లిగా, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, మధు బాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు  ప్రకాష్ తిరుమలశెట్టి  ఏడ్యూకేషన్ ఇగో స్ గురించి  వాటి వలన వచ్చే  ప్రమాదాల గురించి క్షణికావేశానికి లోనై  వారి ప్రాణాలను అర్ధంతరంగా ఎలా పోగొట్టుకుంటున్నారనేదాని  గురించి హీరో హీరోయిన్ పాత్రలతో నేటి యువతి  యువకులకు ర్యాంక్ ల పోటీ గురించి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. పాటలు బాగున్నాయ్ బిజియం కూడా బాగుంది సినిమాటోగ్రాఫి బాగుంది, హైదరాబాద్ నేటి వీటి లో ఛేజింగ్ సీన్స్ కేబుల్ బ్రిడ్జ్ షాట్స్ చాలా క్రేజీ గా వున్నాయి. ఎడిటింగ్ చాలా బాగుంది. ఈ చిత్రం నిర్మాతలు నాగరాజు తిరుమలశెట్టి , P. A నాయుడు బాగా ఖర్చు పెట్టి తీశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!
ప్లస్ లు: 

స్టోరీ, స్క్రీన్ ప్లే
యాక్షన్ సీన్స్
ప్రధాన పాత్రల నటన 
ప్రతి 15 నిముషాలకు వచ్చే ట్విస్ట్ లు
ప్రస్తుత విద్యావ్యవస్థపై మంచి మెసేజ్

మైనస్ లు: 

డి.ఐ. మిక్సింగ్
5.1 మిక్సింగ్
రీ రికార్డింగ్

రేటింగ్: 3/5

More Related Stories