సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై దాడి..Kathi Mahesh
2020-02-15 00:27:56

ఎప్పటికప్పుడు కొత్త వివాదాలతో వార్తల్లో ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు సినిమా విమర్శకుడు కత్తి మహేష్. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడూ చాలా సున్నితమైన అంశాలను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఈయన. అప్పట్లో పవన్ కళ్యాణ్ ను కావాలని రెచ్చగొట్టి మీడియాలో బాగా ఫేమస్ అయిపోయారు కత్తి. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తూ చాలా వరకు కాంట్రవర్సీలు క్రియేట్ చేశాడు. ఆ వెంటనే హిందూ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి నగర బహిష్కరణకు కూడా గురయ్యాడు కత్తి మహేష్. 

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నాడు. కొన్ని రోజుల కింద శ్రీ రాముడిపై కత్తి మహేష్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రాముడికి మాంసం అంటే ఇష్టం.. ఆయన నాన్వెజ్ బాగా తింటాడు అంటూ కత్తి మహేష్ చేసిన కామెంట్స్ హిందుత్వ వాదుల మనోభావాలను బాగా దెబ్బతీశాయి. నువ్వు కనిపిస్తే కచ్చితంగా చంపేస్తాం అంటూ కత్తికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి హిందూ సంఘాలు. అన్నట్లుగానే ఆయన బయట కనిపిస్తే కచ్చితంగా భౌతిక దాడి కూడా చేయడానికి సిద్ధమైపోయారు.

 విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూడటానికి ఆయన ఐమాక్స్ కు వచ్చిన విషయం తెలుసుకొని బయటికి వస్తున్న తరుణంలో ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. కత్తి మహేష్ కూర్చున్న కారు అద్దాలు పగలగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి కత్తి మహేష్ ను అక్కడి నుంచి పంపించేశారు. ఇప్పుడు కాకపోయిన తర్వాత మళ్లీ దొరుకుతావు కదా అప్పుడు కూడా ఇలాంటి దాడులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై కత్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More Related Stories