పవన్ కల్యాణ్‌ను కేసీఆర్ అంత దారుణంగా అవమానించాడా..Pawan Kalyan
2019-11-02 17:35:54

పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దారుణంగా అవమానించాడు. ఇది తెలిసిన తర్వాత అభిమానులు కూడా చాలా హర్ట్ అవుతున్నారు. తమ హీరోకు ఇంతటి అవమానం ఎదురవుతుందని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. అంతగా ఆయన ఎందుకు అవమానించారు అనుకుంటున్నారా.. తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఎంతగా ఉడికిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న కేసీఆర్ అసలు పట్టనట్టుగా ఉండటం వాళ్లకు అసలు నచ్చడం లేదు. దాంతో తమ గోడును పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్లబోసుకున్నారు ఆర్టీసీ కార్మికులు. వీళ్ళ తరఫున కెసిఆర్ తో మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ వకాల్తా పుచ్చుకున్నాడు. అందుకే ఆయన అపాయింట్మెంట్ అడిగాడు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, కేశవరావు అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నించాడు పవన్ కళ్యాణ్. కానీ ఈ ముగ్గురిలో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. కనీసం ఆయనను కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఇదే విషయాన్ని జనసేన ప్రకటనలో తెలిపారు పవన్ కళ్యాణ్. స్వయంగా తాను ఒక అడుగు ముందుకు వేసి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అని చెబితే కూడా ఏమాత్రం స్పందన లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఆయన కూడా బాగా చిన్నబుచ్చుకున్నాడని తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఒక పార్టీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ కోరుతే ఇవ్వకపోవడం అనేది సమంజసంగా లేదు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో ఒక వర్గం గుర్రుగా ఉంది.

More Related Stories