మహానటికి మెగా ఆశీసులు !keerthi suresh
2019-08-16 16:01:34

మ‌హాన‌టి సినిమాలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ నటనా ప్రతిభకు అవార్డులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఆమెను భారత ప్రభుత్వం ఉత్తమ జాతీయ నటిగా ఎంపిక చేయగా తాజాగా సైమా అవార్డ్స్ లో కూడా ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. ఆమె జాతీయ అవార్డుకి ఎంపిక అవ్వగానే ఆమెకు ప్రసంశలు కూడా వెల్లువగా వస్తున్నాయి. పెద్దగ ఫేమ్ లేని ఓ యంగ్‌ డైరెక్టర్‌ తీసినా సరే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సినిమా ‘మహానటి’. అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ కీర్తిని మరింత పెంచినట్టయింది. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్‌ నటించగా ఆమె భర్త జెమినీ గణేషన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ మెప్పించారు. విజయ్‌ దేవరకొండ, సమంత ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినీ అభిమానులు, నటులను మాత్రమే కాదు వివిధ రంగాల్లోని ప్రముఖుల మనసుల్ని సైతం దోచుకుంది. తాజాగా ఆమె దుబాయ్ లోని ఖతార్లో జరుగుతున్న జ‌రిగిన‌ `సైమా అవార్డుల‌` వేడుక‌లో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. ఈ అవార్డుల కార్య‌క్రమంలో సావిత్రిని త‌ల‌పించేలా చీర‌క‌ట్టులో కీర్తి మెరిసింది. ఈ కార్యక్రమానికి హాజరయిన మెగాస్టార్ వ‌ద్ద‌కు వెళ్ళిన కీర్తి కింద కూర్చుని మరీ ఆయనతో న‌వ్వులు చిందిస్తూ ముచ్చ‌ట్లాడారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Related Stories