ఆకట్టుకుంటున్న మిస్ ఇండియా ట్రైలర్Keerthy Suresh
2020-10-24 23:48:02

మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తిసురేష్ తన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు కీర్తికి జాతీయ ఉత్తమనటి అవార్డు సైతం వచ్చింది. ఇక ఈ సినిమా తరవాత కీర్తికి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన పెంగ్విన్ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలోనే వచ్చింది. ఇక కీర్తి సురేష్ నటించిన మరో సినిమా "మిస్ ఇండియా" ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికి లాక్ డౌన్ కారణంగా విడుదలకి నోచుకోలేదు. దాంతో ఓటిటీ లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయంచింది. ఈ మేరకు నవంబర్ 4 న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. 

ఇక ఇప్పయికే విడుదల అయిన సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై కోనేరు మహేష్ నిర్మించారు. నరేంద్రనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు థమన్ స్వరాలను అందించారు. అంతే కాకుండా సినిమాలో నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నదియా, సీనియర్ నరేష్, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. 2 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. ట్రైలర్ లో కీర్తి సురేష్ ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెద్ద వ్యాపారవేత్త గా ఎదుగుతుందని అర్థం అవుతోంది. వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో ఆమె ఎదురుకొన్న కష్టాలని ఈ సినిమాలో చూపించనున్నారు.

More Related Stories