అయ్యో కీర్తి సురేష్‌కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి..?keerthy
2020-01-04 13:36:32

ఇప్పుడు ఈ ఫోటో చూసిన తర్వాత అందరికీ ఇదే అనిపిస్తుంది కదా. బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తి సురేష్ ఇప్పుడు ఇలా మారిపోయింది. దాంతో ఆమె అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అసలు ఏమైంది ఈమెకు.. ఎందుకు ఇలా మారిపోయిందంటూ కీర్తిని చూసి ఫీల్ అవుతున్నారు. మహానటి సినిమాలో బొద్దుగా కనిపించిన కీర్తి.. ఆ తర్వాత సన్నగా మారడం మొదలుపెట్టింది. ప్రస్తుతం హిందీ సినిమాలో నటిస్తున్న ఈమె.. ఆ సినిమా కోసమే పూర్తిగా మారిపోయింది. సౌత్ లో పెంగ్విన్ సినిమాతో పాటు మిస్ ఇండియాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక హిందీలో మైదాన్ సినిమాలో నటిస్తుంది. ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా వస్తుంది. బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కోసమే బొద్దుగుమ్మ కాస్తా స్లిమ్ భామ అయిపోయింది. బక్కగా అవ్వడం అంటే ఏమో అనుకున్నారు కానీ మరీ పీలగా మారిపోయింది ఈమె. బరువు తగ్గి కొత్త లుక్ అయితే చేసింది కానీ మునపటి లుక్ మాత్రం మొత్తం పోయింది. బొద్దుగా ఉన్నపుడే బాగున్నావు కీర్తి.. ప్లీజ్ మళ్లీ అలా అయిపో అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారు అభిమానులు. ఈ మధ్యే మహానటి సినిమాలో నటనకు గానూ జాతీయ అవార్డు అందుకున్నపుడు కూడా కీర్తి ఫోటోషూట్ వచ్చింది. అందులో కూడా సన్నగా ఉంది కీర్తి. దాంతో వీలైనంత త్వరగా ఆ హిందీ సినిమా ఏదో పూర్తి చేసి మళ్లీ బరువు పెరగవా అంటూ కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను కీర్తి తీరుస్తుందో లేదో చూడాలిక.

 

More Related Stories