తండ్రి విజ్ఞప్తి...రేటు తగ్గించిన కీర్తి సురేష్Keerthy Suresh
2020-06-17 19:11:40

కరోనా ప్రభావంతో దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ముందు వరుసలో ఉంది. మరో వైపు సినిమా థియేట‌ర్స్ ఓపెన్ చేసే విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డంతో చిన్న నిర్మాతల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారయిందని చెప్పచ్చు. అప్పులు తెచ్చిన చిన్న సినిమాల నిర్మాత‌లు సినిమాల‌ను డిజిట‌ల్ మీడియాల్లో విడుద‌ల చేసుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. ఇప్ప‌టికే హీరో సూర్య స‌హా మ‌రి కొంతమంది తాము నిర్మించిన సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేసేశారు. ఈ కోవలోనే కీర్తిసురేశ్ సినిమా పెంగ్విన్ ఓటీటీలో విడుదలవుతుంది. అలాగే ఆమె నటించిన మరో సినిమా మిస్ ఇండియా కూడా ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశాలే ఉక్కువగా ఉన్నాయి. 

ఇక షూటింగ్ విషయానికి వస్తే షూటింగ్‌లకు పర్మిషన్స్ వచ్చినా కానీ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ త‌రుణంలో కీర్తి రెండు, మూడు నెల‌ల వ‌ర‌కు సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉండాల‌నుకుంటుంద‌ని తాను చేస్తున్న సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్స్ 25-30 శాతం త‌గ్గించుకునే ఆలోచ‌న‌లోనూ ఉంద‌ని ఆమె పీఆర్ టీమ్ దర్శక నిర్మాతలకి సందేశాలు పంపారట. ఇక ఆమె  ప్రస్తుతం రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న అన్నాత్తా చిత్రంలో కీర్తి సురేష్‌ ఆయనకు కూతురుగా నటిస్తోంది. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కీర్తిసురేష్‌ తండ్రి సురేష్‌ కుమార్‌ మలయాళంలో నిర్మాతగా ఉన్నారు, ఆయన సినీ పరిశ్రమ కోలుకోవాలంటే నటీనటులు పారితోషకాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కీర్తి సురేష్‌ పారితోషకం తగ్గించుకున్నట్టు ప్రకటించటం గమనార్హం.  

More Related Stories