కేశ‌వ‌ రివ్యూ రేటింగ్Keshava-Review-Rating
2017-05-19 15:19:06

వ‌ర‌స విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీని దున్నేస్తున్న హీరో నిఖిల్. వ‌ర‌స‌గా కొత్త క‌థ‌లు ఎంచుకోవ‌డం.. విజ‌యాలు అందుకోవ‌డం ఈయ‌న‌కు కామ‌న్ గా మారిపోయింది. ఇప్పుడు కేశ‌వ సినిమాతో వ‌చ్చాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈ సారి కూడా స‌క్సెస్ అయ్యాడా..?

క‌థ : కేశ‌వ‌(నిఖిల్) లా స్టూడెంట్. అత‌డికి కుడివైపు గుండె ఉంటుంది.. అత‌డు ఆవేశ‌ప‌డితే చ‌నిపోతాడు. ఏ ప‌ని చేసినా కూల్ గా చేయాలి. అత‌డికి ఓ ప‌గ కూడా ఉంటుంది. కొంత‌మందిని చంపాల‌ని తిరుగుతుంటాడు. ఒక్కొక్క‌రినీ టార్గెట్ చేసి చంపేస్తుంటాడు. మ‌రోవైపు త‌న చ‌దువును కూడా కొన‌సాగిస్తుంటాడు. అక్క‌డే రితూవ‌ర్మ ప‌రిచ‌యం అవుతుంది. ఎవ‌రికీ తెలియ‌కుండా ఒక్కో పోలీస్ ఆఫీస‌ర్ ను చంపేస్తూ వెళ్తుంటాడు కేశం. ఈ సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్ వెన‌క ఉన్నది ఎవ‌రో క‌నుక్కోడానికి స్పెష‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్ (ఇషా కొప్పిక‌ర్) వ‌స్తుంది. అస‌లు కేశ‌వ ఎందుకు చంపుతుంటాడు.. అత‌డి ప‌గ ఏంటి.. ఇవ‌న్నీ మిగిలిన క‌థ‌.

క‌థ‌నం : కొత్త క‌థ‌లంటూ ఏవీ ఉండ‌వు.. ఉన్న క‌థ‌ల‌నే కొత్త‌గా చూపించాలి. కేశ‌వ సినిమాతో సుధీర్ వ‌ర్మ ఇదే చేసాడు. త‌ల్లిదండ్రుల్ని చంపిన వాళ్ల‌పై ప‌గ తీర్చుకునే కొడుకు క‌థే కేశ‌వ‌. కొన్ని వేల‌సార్లు ఈ క‌థ చూసుంటాం. కానీ కేశ‌వ కొత్త‌గా అనిపించింది. దానికి కార‌ణం ద‌ర్శ‌కుడు తీసిన విధానం.. ఆయ‌న రాసుకున్న క‌థ‌నం. హీరో ఏం చేస్తాడో తెలుసు.. ఎలా చేస్తాడో తెలియ‌దు.. అదే కేశ‌వ‌లో హైలైట్. పైగా హీరోకు కుడివైపు గుండె ఉంటుంది.. అత‌డికి కోపం వ‌స్తే చ‌చ్చిపోతాడు. అలాంటి వాడు ప‌గ తీర్చుకోవాలి. ఇదే కేశ‌వ‌లో కొత్త‌గా అనిపించింది. క‌థ తెలిసిందే అయినా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప‌రుగులు పెట్టించాడు సుధీర్ వ‌ర్మ‌. ఫ‌స్టాఫ్ అయితే అద్భుతంగా తీసాడు.

సెకండాఫ్ లోనూ అదే గ్రిప్పింగ్ తో క‌థ సాగుతుంది. అయితే ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త లోపాలు క‌నిపించినా.. చివ‌ర‌గా కేశ‌వ కొత్త అనుభూతిని క‌లిగించ‌డం మాత్రం ఖాయం. కేశ‌వ‌తో నిఖిల్ కొత్త క‌థ‌ల‌కు మ‌రోసారి కేరాఫ్ అడ్ర‌స్ అని నిరూపించుకున్నాడు. దోచేయ్ తో గాడిత‌ప్పిన సుధీర్.. ఈ సారి మాత్రం టార్గెట్ రీచ్ అయ్యాడు. అవ‌స‌ర‌మైన‌పుడు సీరియ‌స్.. మ‌ధ్య‌లో రిలీఫ్ కోసం కామెడీని చ‌క్క‌గా మిక్స్ చేసాడు సుధీర్ వ‌ర్మ‌.
పోలీస్ ఆఫీస‌ర్ గా ఇషా కొప్పిక‌ర్ బాగా న‌టించింది. క్లైమాక్స్ వ‌ర‌కు గ్రిప్పింగ్ గా వెళ్లింది కేశవ‌.

న‌టీన‌టులు : నిఖిల్, రితూవ‌ర్మ‌, ఇషా కొప్పిక‌ర్, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు.. క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుధీర్ వ‌ర్మ‌  కేశ‌వ‌గా నిఖిల్ అద‌ర‌గొట్టేసాడు. అత‌డికి కొత్త కారెక్ట‌ర్లు కొట్టిన పిండిగా మారిపోయాయి. కోపం వ‌స్తే చ‌చ్చిపోతాడు.. అలాంటి వాడు కోప్ప‌డ‌కుండా హ‌త్య‌లు చేయాలి.. ఇలాంటి కారెక్ట‌ర్ ను చాలా కూల్ గా చేసాడు నిఖిల్. ముఖ్యంగా సినిమాలో ఎక్క‌డా అత‌డి ఫేస్ లో కంప్లీట్ గా న‌వ్వు క‌నిపించ‌దు అంత సీరియ‌స్ కారెక్ట‌ర్ అది. ఇక హీరోయిన్ రితూవ‌ర్మ జ‌స్ట్ స‌పోర్టింగ్ రోల్ చేసింది. ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా ఇషాకొప్పిక‌ర్ బాగా చేసింది. కొత్త ఫేస్ కావ‌డంతో సినిమాకు ప్ల‌స్ అయింది. రావుర‌మేష్, బ్ర‌హ్మాజీ, అజ‌య్ అంతా పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు ఒదిగిపోయారు.

టెక్నిక‌ల్ టీం : కేశ‌వ‌లో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సింది బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు బిజి లేక‌పోతే చూడ‌లేం. ఈ విష‌యంలో సుధీర్ చాలా కేర్ తీసుకున్నాడు. ఇక స‌న్నీ మ్యూజిక్ కూడా సినిమాకు ప్ల‌స్ అయింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వ‌చ్చే కాల‌భైర‌వ ఆస్త‌కం అదిరిపోయింది. ఇక ద‌ర్శ‌కుడిగా సుధీర్ వ‌ర్మ ఈ సారి మ్యాజిక్ చేసాడు. హాలీవుడ్ రేంజ్ స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఛాప్ట‌ర్స్ మేకింగ్ ను తీసుకొచ్చాడు. సెకండాఫ్ పై ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టుంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది..!

చివ‌ర‌గా : థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు కేశవ ఫుల్ మీల్సే.. కొత్త‌ద‌నం కోరుకునే వాళ్ల‌కు కూడా ఈ సినిమా మంచి ఛాయిస్. ఓవ‌రాల్ గా బాహుబ‌లి 2 త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో విజ‌యం ద‌రిచేరిన‌ట్లే..!

రేటింగ్ 3/5

More Related Stories