కేజీఎఫ్ 2 సర్ప్రైజ్.. పాత సెంటిమెంట్‌నే నమ్ముకున్న ప్రశాంత్ నీల్

దేశమంతా కేజీఎఫ్-2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో.. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్టేడ్ వెల్లడించబోతున్నట్టు దర్శకుడు ప్రకటించారు.పాత సెంటిమెంట్‌నే రిపీట్ చేస్తూ డిసెంబర్ 21వ ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. 2018 సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీనే కేజీఎఫ్ ఛాప్టర్-1 విడుదలై సూపర్ హిట్ కావడంతో ఆ తేదీనే సెంటిమెంట్‌గా పెట్టుకున్న ప్రశాంత్ నీల్.. గతేడాది 2019 డిసెంబర్ 21వ తేదీన కేజీఎఫ్- 2 నుంచి యశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. అప్పటినుంచి ఈ మూవీపై ఓ కన్నేసి ఉంచిన ప్రేక్షకులు తదుపరి అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టిన ప్రశాంత్ నీల్.. ''కేజీఎఫ్-2 షూటింగ్ చివరి దశకు చేరింది. ప్రతిఏడాది డిసెంబర్ 21న అభిమానులను సర్ప్రైజ్ చేసిన మేము ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని ఫాలో అవుతున్నాం. డిసెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని తెలిపారు.