కేజీఎఫ్ 2 టీజర్...బాంబ్ బ్లాస్ట్ బర్త్ డే గిఫ్ట్  KGF Chapter2
2021-01-07 21:53:13

KGF Chapter2 TEASER..గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న కేజీఎఫ్‌-2 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హీరో యశ్‌, సంజయ్‌ దత్‌లపై చిత్రీకరించే భాగం పూర్తి చేసుకోగా ఫైనల్‌ షెడ్యూల్‌ జనవరిలో పూర్తి కానుంది. లేటెస్ట్ గా కేజీఎఫ్‌-2 నుంచి స్టన్నింగ్‌ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే టీజర్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

'పవర్ పుల్ పీపుల్ పవర్ ఫుల్ ప్లేషెస్ నుంచి వస్తారని చరిత్ర చెబుతోంది'' అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ గూస్ బమ్స్ కలిగిస్తోంది. టీజర్ చివర్లో రాకీభాయ్ గా యష్ ఓ మెషిన్ గన్ పట్టుకొని కాల్చే సీన్ అద్భుతంగా ఉంది. కాలుతున్న మెషిన్ గన్ కి సిగరెట్ ముట్టించుకుంటూ యష్ కోపంగా చూడటంతో టీజర్ పూర్తయింది.  హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. 

More Related Stories