మహేష్ ని కలిసిన కేజీఎఫ్ డైరెక్టర్ Mahesh Babu
2019-09-09 12:55:22

ఈ మధ్య కాలంలో సౌత్ లో సంచలన విజయం సాధించిన సినిమా కేజీయఫ్‌. కన్నడ రాక్ స్టార్ యష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సాండల్‌వుడ్‌లో మాత్రమే కాక తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. ముఖ్యంగా ప్రశాంత్‌ తెరకెక్కించిన హీరో ఎలివేషన్‌ సీన్స్‌ మన తెలుగు హీరోలకి పడితే అసలు ఒక రేంజ్ లో ఉండదని అందుకే మన తెలుగు హీరోలు కొందరు ఆయన టీమ్ ని సంప్రదిన్చార్నై ప్రచారం జరిగింది. సుకుమార్ తో అనుకున్న సినిమాను కాద‌నుకుని మరీ అనిల్ రావిపూడి సినిమా మొద‌లు పెట్టాడు మహేష్ బాబు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా మొద‌లైపోయి చివరి దశకు చేరుకుంది కూడా. 

అయితే నిన్న ప్రశాంత్ నీల్ మహేష్ బాబు ఇంటికి వెళ్లి ఒక కధ నేరేట్ చేశాడని అంటున్నారు. ఆ కధ మహేష్ కి బాగా నచ్చిందని ఆయన ఆ కధకి ఓకే చెప్పాడని అంటున్నారు.  ఇప్పటికే ఈ కథను మహేష్ భార్య నమ్రత వినిపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 షూట్ కోసం హైదరాబాద్ లో ఉన్న ప్రశాంత్ నిన్న మహేష్ టైం ఇవ్వగానే వెళ్లి ఒప్పించాడట. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఈ సినిమాని మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ తెరకెక్కించనుందని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ ప్రచారం అయితే సాగుతోంది.

More Related Stories