ఆర్ఆర్ఆర్ వాయిదా...కేజీఎఫ్ క్యాష్ చేసుకుంటోంది KGF2
2020-02-06 19:59:55

ఎన్నో ఊహాగానాలు, ఎన్నో ప్రచారాల అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువ టైమ్ పడుతుండటంతో ముందుగా చెప్పిన డేట్ ను కాదని ఏకంగా వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ ఏడాది 2020 జులై 30 న రిలీజ్ చేయాలనుకున్న సినిమాని ఏడాది జనవరి 8వ తేదీకి మార్చారు. 

ఇక ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అలా డేట్ మార్చిందో లేదో అప్పుడే మరో సినిమా ఆ రిలీజ్ డేట్ ను బ్లాక్ చేసుకుందని చెబుతున్నారు. ఆ సినిమా మరేదో కాదు మరో బాహుబలిగా పెరుతెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.ఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 సినిమా. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. 

ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్‌ సినిమా జోరుతో కె.జి.ఎఫ్‌- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ డేట్ ఖాళీ కావడంతో షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి జులై 30 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.  

More Related Stories