30 కోట్ల బడ్జెట్ పెడితే... 30 లక్షల కలెక్షన్ వచ్చింది..



 khaali peeli
2020-12-11 13:50:52

కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్ల వరకు రాలేరు. ఆ విషయం తెలిసి థియేటర్లను ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. దానికి ఓటీటీ అని పేరు పెట్టారు. నేరుగా ఆన్లైన్ లో సినిమాలను విడుదల చేస్తున్నారు. దానికోసం కొన్ని OTT సంస్థలు కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు కొంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. కానీ మరికొన్ని మాత్రం అత్యంత దారుణంగా విఫలం అవుతున్నాయి. ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. 29 కోట్లు పెట్టి కొన్న సినిమా కేవలం 30 లక్షలు మాత్రమే వసూలు చేసి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కష్టాలు తీసుకొచ్చింది. ధడక్ హీరో ఇషాన్ కట్టర్, అనన్య పాండే జంటగా ఖాళీ పీలీ సినిమా వచ్చింది.

అసలు ఇలాంటి సినిమా ఒకటి వచ్చింది అని కూడా ప్రేక్షకులకు తెలియదు. దీనిని జి 5 వేదికగా విడుదల చేశారు. అయితే నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేసినా కూడా పే ఫర్ వ్యూ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమాను చూడాలి అంటే 299 రూపాయలు చెల్లించాలి. అలా చెల్లించి ఎంత మంది కూర్చుని అయినా ఆ సినిమాని చూడొచ్చు. ఇందులో భాగంగానే కేవలం 20 వేల 900 వందల మంది మాత్రమే ఈ సినిమాను చూశారు. అలా 60 లక్షలకు పైగా కలెక్షన్ వచ్చింది. అందులో మళ్ళీ జి 5 తన వాటా తాను తీసుకోగా నిర్మాతలకు వచ్చింది 30 లక్షలు మాత్రమే. అంటే 30 కోట్లు పెట్టి తీసిన సినిమా 30 లక్షలు వసూలు చేసింది అన్నమాట.

అసలు ఇలాంటి డిజాస్టర్ చరిత్రలో ఎప్పుడైనా వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తున్నారు విశ్లేషకులు. ఈ సినిమాను ప్రేక్షకులు చూడకపోవడానికి ప్రధాన కారణం బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య. ఆయన చనిపోయిన తర్వాత వారసుల సినిమాలు చూడకూడదు అని ఓ వర్గం నిర్ణయించుకుంది. అందుకే వారసుల సినిమాలు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన సడక్ 2 సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇషాన్ కట్టర్, అనన్య పాండే సినిమాకు కూడా ఇదే గతి పట్టింది. త్వరలో రాబోయే వారసుల సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు సుశాంత్ అభిమానులు. 

More Related Stories