బాలీవుడ్ బాట పట్టిన టాక్సీవాలా.. హీరో ఎవరంటే.. Khaali Peeli
2019-10-23 18:02:26

విజయ్ దేవరకొండ సినిమాలకు తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో కూడా మంచి డిమాండ్ వుంది. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే అన్ని భాషల వాళ్ళు ఆ కథ వైపు చూస్తూ ఉంటారు. ఇప్పటికే విజయ్ నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. గీతగోవిందం సినిమా రీమేక్ కు కూడా రెడీ అవుతుంది. ఇ

క ఇప్పుడు టాక్సీవాలా సినిమా రీమేక్ అక్కడ మొదలైంది. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ముందు ఈ సినిమాను విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావించారు దర్శక నిర్మాతలు. ఇదే సినిమాతో బాలీవుడ్ కు పరిచయం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం టాక్సీవాలా రీమేక్ లో నటించడానికి అస్సలు ఒప్పుకోలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో ధడక్ హీరో ఇషాన్ కట్టర్ నటిస్తున్నాడు. జీ స్టూడియోస్, ఏఏజెడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మక్బూల్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాక్సీవాలా టైటిల్ హిందీలో ఖాళీ పీలిగా ఫిక్స్ చేసారు. కచ్చితంగా ఈ సినిమా హిందీలో కూడా సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. హాట్ బ్యూటీ అనన్య పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మరి తెలుగులో ఎన్నో వాయిదాలు పడి విడుదలై సంచలన విజయం సాధించిన టాక్సీవాలా హిందీలో ఎలా ఆడుతుందో చూడాలి.
 

More Related Stories