రవితేజ డైరక్టర్ రమేష్ వర్మకి కరోనాRamesh Varma
2021-04-20 12:59:50

టాలీవుడ్  సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడటం కంగారు పుట్టిస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సోను సూద్తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరో తెలుగు డైరక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. సినీ దర్శకుడు రమేష్ వర్మ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. 

ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా రమేష్ వర్మ తెలిపారు. అలాగే అందరూ తప్పకుండా ధరించాలని అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని కోరారు. సినిమాల విషయానికి వస్తే రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజ హీరోగా ఖిలాడి సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

More Related Stories