మహేష్ కి నో చెప్పి ప్రభాస్ కి ఎస్ చెప్పిందా mahesh prabhas
2020-05-02 23:49:13

ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు. అయితే మళ్ళీ తన తదుపరి సినిమాని తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడని ముందే క్లారిటీ ఇచ్చినా అది ఎందుకో కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ పరశురామ్ కాంబినేషన్ సినిమా ఒకటి తెర మీదకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా గురించి రకరకాల గాసిప్స్ మాత్రం తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. 

అదేంటంటే ఈ సినిమా కోసం నటించమని కియారాను అడిగితే ఆమె నో చెప్పిందట. ఆమె ఈ ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరించారని చెబుతున్నారు. ఎందుకంటే కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. అయితే ఇప్పుడీ భామ మహేష్ ను కాదని ఏకంగా ప్రభాస్‌ మూవీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందనే ప్రచారం మొదలయింది. అయితే అందులో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ మహేష్ సరసన మల్లూ బ్యూటీ ప్రియా ప్రకాష్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. 

More Related Stories