మరోసారి మహేష్ సరసన కియారా ...Kiara Advani
2020-05-28 17:14:12

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఒక రకంగా ఇది ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వెండితెర మీదనే కాక బుల్లి తెర మీద కూడా సంచలనం సృష్టించింది. మొన్న ఉగాదికి ఈ సినిమాని టివీలో ప్రదర్శిస్తే అత్యధిక టిఆర్పీ సాధించిన తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత బ్రేక్ తీసుకున్న మహేష్ కొత్త సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడింది. అయితే తన తర్వాతి సినిమా విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీకి ఒచ్చేసాడు. ముందు వంశీ పైడిపల్లితో అనుకున్నా కానీ పరశురామ్ తో చేస్తున్నట్టు ఖరారు అయినట్టే. 

ఇక తాజాగా సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహేష్ కి మెయిల్ చేశాడట పరశురామ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్ లేదా కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తారని లేదు వేరే హీరోయిన్ అంటూ మరి కొంత మంది పేర్లు కూడా ప్రచారం జరిగాయి. ఇక మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అఫీషియల్ గా లాంఛ్ కాబోతుంది.  దీనికి క్రేజీ టైటిల్ ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. మహేష్ సినిమాకు సర్కార్ వారి పాట అంటూ అదిరిపోయే టైటిల్ ఒకటి కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. 

పరశురామ్ ఈ సినిమా కథను పూర్తిగా కమర్షియల్ కోణంలో సిద్ధం చేసాడని.. పక్కా మహేష్ ఇమేజ్ కు సరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది. ఇక తాజాగా మళ్ళీ కియారానే ఈ సినిమా హీరోయిన్ అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్‌ అనే నేను సినిమాలో కియారా హీరోయిన్‌ గా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ భామ మహేష్ సినిమాలో నటించనుంది. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories