రామ్ చ‌ర‌ణ్ కు విల‌న్ గా క‌న్న‌డ స్టార్



Kiccha Sudeep
2021-05-05 14:58:37

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఇక‌ క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం వాయిదా ప‌డింది. ఇదిలా ఉండ‌గా చ‌ర‌ణ్ నెక్స్ట్ సినిమా త‌మిళ‌స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక‌ శంక‌ర్ ఈ సినిమా క‌థ‌పైనే క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు చెందిన న‌టీన‌టులను భాగం చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందులో భాగంగానే క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ ను కూడా సినిమాలో భాగం చేయాల‌ని శంక‌ర్ అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే శంక‌ర్ సుదీప్ కు ఫోన్ చేసి పూర్తి క‌థ చెప్పిన‌ట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో సుధీప్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా సినిమాలో విల‌న్ పాత్ర కోసం శంక‌ర్ సుదీప్ ను సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. సుదీప్ ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో విల‌న్ గా న‌టించి అల‌రించారు. ముఖ్యంగా నాని హీరోగా న‌టించిన ఈగ సినిమాతో సుదీప్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఈ చిత్రంలో సుధీప్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిశాయి. ఇక చ‌ర‌ణ్ సినిమాలో సుధీప్ న‌టిస్తారా లేదా అన్న‌దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వెలుబ‌డాల్సిందే. 

More Related Stories