కోర‌మీసం పోలీసోడుతో శృతి హాస‌న్‌ రొమాన్స్



Raviteja Krack
2020-12-25 11:39:17

నేడు కిష్మస్ కానుకగా మాస్ మహారాజ్ ర‌వితేజ 'క్రాక్' నుండి 'కోర‌మీసం పోలీసోడా' అనే సాంగ్ లిరిక‌ల్ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 'కోరమీసం పోలీసోడా' సాంగ్ లిరిక్స్ చూస్తుంటే ఇదొక రొమాంటిక్ సన్నివేశంలో వచ్చే పాట అని అర్థం అవుతోంది. 'ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో.. నీ జంట కట్టింది ఒంటి మీద ఖాకీ.. అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో.. నీ తలుపు తట్టింది ఏరి కోరి వెతికీ' అంటూ పోలీస్ అయిన భర్తతో భార్య పాడుకునే పాట అని తెలుస్తోంది. 

'నీ అండ చూసింది నెత్తెక్కి కూర్చుంది నన్నెల్లి పొమ్మంది సవతి.. రవ్వంత నీపక్క చోటివ్వనంటుంది పొట్లాట కొస్తోంది దండెత్తి.. ఆ సంగతేందో ఓ కాస్తా నువ్వే తేల్చుకోరా పెనిమిటీ' అంటూ భర్త ఎంత సిన్సియర్ పోలీస్ అనేది వెల్లడిస్తూనే నన్ను కూడా పట్టించుకోమని అడుగుతోంది.గోపిచంద్ మలినేని - రవితేజ కలయికలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Related Stories