ఆ ఇద్దరు డైరెక్టర్స్ బాటలోనే కొరటాల Koratala Siva
2020-08-10 09:10:20

మహేష్ బాబు కు 'భరత్ అనే నేను' లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాని కరోనా కారణంగా రెండేళ్ళు అయినా రిలీజ్ చేయలేదు. చిరంజీవి సినిమాను పూర్తి చేసిన తరువాత ఆయన అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కొరటాల సుధాకర్ ఇద్దరూ కలిసి భవిష్యత్తులో చిన్న సినిమాలు నిర్మించాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. నిజానికి  ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ కొరటాలకు అత్యంత ఆప్తుడు. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాల్లో తనకు ఎంతగానో సాయపడిన స్నేహితుడు కం పంపిణీదారుడు సుధాకర్ మిక్కిలినేని కోసం అన్ని కమిట్ మెంట్లను పక్కనబెట్టి సినిమా చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

కానీ చిరు సినిమా ఓకే అవ్వడంతో చిరంజీవి సొంత ప్రొడక్షన్ లోనే సినిమా చేతల్సి వచ్చింది. అయినా ఆచార్య  ఈ ఏరియా హక్కులు తన స్నేహితుడికి ఇవ్వాలని కొరటాల భావిస్తున్నారట. అలానే ఇంకా చేయబోయే సినిమాలు అన్నీ అయన బ్యానర్ లోనే చేయనున్నారట. ఇప్పటికే సుకుమార్, త్రివిక్రమ్ లు ఆ బాటలోనే ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు ఆప్తుడు అయిన చినబాబుకు చెందిన హారిక హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లోనే సినిమాలు చేస్తాడు.  సుకుమార్ కూడా దాదాపు మైత్రీ వాళ్ళకే సినిమాలు చేస్తున్నాడు. అలానే వీరి బాటలోనే కొరటాల అడుగులు వేయనున్నారన్న మాట. 
 

More Related Stories