ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ కు కొరటాల మెరుగులు



Koratala Siva
2021-05-03 18:34:52

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణలో సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా స్క్రిప్ట్ లో కొర‌టాల కొన్ని మార్పులు చేస్తున్నార‌ట‌. పాన్ ఇండియా సినిమాకు స‌రిపోయేలా స్క్రిప్ట్ ను మారుస్తున్నార‌ట‌. 

ప్ర‌స్తుతం కొర‌టాల ఆచార్య సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ప‌డ‌టంతో కొర‌టాల ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ ను ప‌ట్టుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ని అనుకుంటున్నారు. కైరా అద్వానీని కొర‌టాల భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేసారు. ఇక ఇప్ప‌టికే ఎన్టీఆర్ 30 కోసం కూడా సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ నభా న‌టేష్ ను అనుకుంటున్నట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొర‌టాల కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే జ‌న‌తాగ్యారేజ్ సినిమా వ‌చ్చింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. దాంతో ఎన్టీఆర్ 30పై అభిమానుల‌కు భారీ అంచనాలున్నాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను రీచ్ అవుతారా లేదా అన్న‌ది చూడాలి.  

More Related Stories