అవ‌కాశాల కోసం ప‌వ‌ణ్ చిరుల‌కు కోట ఫోన్



Kota Srinivasa Rao
2021-03-08 13:54:42

ప్ర‌ముఖ న‌టులు కోట శ్రీనివాస్ తెలుగునాట ఎన్నో సినిమాల్లో న‌టించి అల‌రించారు. విల‌న్ పాత్ర‌లు, కామెడీ పాత్ర‌లు అని తేడా లేకుండా ఆయ‌న న‌ట‌న‌తో టావీవుడ్ లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 80 వ ద‌శ‌కం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్నో సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయ‌న  పెద్ద‌గా తెర‌పై క‌నిపించ‌డం లేదు..వ‌య‌స్సు పైన ప‌డ‌టం అంతే కాక అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న వీక్ గా క‌నిపించ‌డంతో ద‌ర్శ‌కులు పెద్దాగా అవకాశాలు ఇవ్వ‌డంలేదు. కోట శ్రీనివాస్ చివ‌ర‌గా ప‌వ‌ర్ ప్లే అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో కూడా ఆయ‌న న‌ట‌న చాలా నీర‌సంగా క‌నిపించారు. 

ఇది వ‌ర‌కు ఆయ‌న‌లో ఉన్న ఉషారు త‌నం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అయితే తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డించారు. లాక్ డౌన్ లో కాలంలో ఇంట్లో ఉండి చాలా బోర్ కొట్టింద‌ని కోట శ్రీనివాస్ అన్నారు. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రియు మ‌హేష్ బాబు ల‌కు ఫోన్ చేసిన‌ట్టు వెల్ల‌డించారు. అంతే కాకుండా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్ కు కూడా ఫోన్ చేసిన‌ట్టు తెలిపారు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న క‌ల్యాణ్ హీరోగా వ‌స్తున్న సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు చెప్పారు. కాగా డ‌బ్బు కోసం కోట ఆవ‌కాశాల‌ను వెతుక్కోవ‌డం లేదు. ఇంత కాలం సినిమాల్లో బిజీగా గ‌డిపిన ఆయ‌న కాళీగా ఇంట్లో కూర్చోలేక సినిమాల్లో న‌టించేందుకు ఆవ‌కాశాల‌ను వెతుక్కుంటున్నారు. 

More Related Stories