తెలంగాణ ముఖ్యమంత్రిగా కోట శ్రీనివాస రావు.. kota srinivasa rao
2020-07-11 17:03:39

తెలంగాణ ముఖ్యమంత్రి అనగానే మనకు ముందుగా కేసీఆర్ మొహం అలా కళ్ల ముందుకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు కోట శ్రీనివాస రావు తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోయాడు. అదెలా అంటే సినిమా కోసమే. అదే సినిమాలో ఉన్న మాయ. జులై 10న ఈ విలక్షణ నటుడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు నటిస్తున్న కొత్త సినిమా లుక్ విడుదల చేసారు. 40 ఏళ్ల కెరీర్ లో ఈయన వేయని పాత్రలు లేవనే చెప్పాలి.. భారతదేశంలో సుమారు అన్ని భాషల్లో నటించి మెప్పించిన గొప్ప లెజండరి యాక్టర్‌ ఆయన. గతంలో చాలా చిత్రాల్లో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. మరికొన్ని పాత్రల్లో అపోజిషన్‌ లీడర్‌గా కనిపించి అశేష ప్రేక్షకలోకాన్ని మెప్పించారు.

కాని మొట్టమొదటి సారిగా కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ ముఖ్యమంత్రిగా 'రోరి' చిత్రంలో నటించడం విశేషం. ఈ చిత్రంలో ఆయన చాలా సెన్సిటివ్‌ ముఖ్యమంత్రిగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర పేరు ఆర్‌.రామన్న చౌదరిగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ సంయుక్తంగా చరణ్‌ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్‌లుక్‌ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌కి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ రావటం విశేషం' అని చిత్ర బృందం తెలిపింది. భీన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

More Related Stories