మాస్ మహారాజ్ కి భలేగా తగిలిన బంగారం Raviteja Krack
2020-12-14 18:35:43

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ నుండి భలేగా తగిలావే బంగారం సాంగ్ ను చిత్ర యూనిట్  రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తనదైన శైలిలో ఆలపించారు. ఈ మధ్య  మంచి ఫామ్ లో ఉన్న తమన్ యూత్ ని ఆకట్టుకొనే సాంగ్ ని అందించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని టాక్. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. 

More Related Stories