క్రాక్ లేటెస్ట్ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్ వైపు మాస్ రాజా అడుగులు..



Krack
2021-01-18 17:07:40

ఒకటి రెండు కాదు దాదాపు నాలుగేళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ రచ్చ చేస్తున్నాడు రవితేజ. ఈయన నటించిన క్రాక్ సినిమాకు సంచలన వసూళ్లు వస్తున్నాయి. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇప్పటివరకు 8 రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 23 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా క్రాక్ సినిమా రికార్డులు తిరగరాసింది. ఇదంతా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే జరిగింది. ఒకవేళ 100% కెపాసిటీ ఉండుంటే ఖచ్చితంగా ఇప్పటికే 40 కోట్ల వరకు వసూలు చేసేది క్రాక్.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్ లను లాభాల బాట పట్టించింది. నిర్మాతలకు కూడా మంచి లాభాలు తీసుకొస్తుంది ఈ సినిమా.

ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో 24 కోట్ల షేర్ వసూలు చేసింది చేసింది. ఇప్పటికే హిట్, సూపర్ హిట్ స్టేజ్ దాటి బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తోంది ఈ సినిమా. బలుపు సినిమా తర్వాత మరోసారి ఇందులో శృతి హాసన్ తో రొమాన్స్ చేశాడు రవితేజ. ఇక పూరి జగన్నాథ్ తర్వాత రవితేజకు హ్యాట్రిక్ విజయాలు అందించిన దర్శకుడిగా గోపీచంద్ మలినేని నిలిచిపోయాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలతో రవితేజకు వరుస విజయాలు అందించాడు పూరి. ఆ తర్వాత డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలతో గోపిచంద్ కూడా మూడు విజయాలు ఇచ్చాడు. ఏదేమైనా చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన సూపర్ హిట్ ను అదిరిపోయేలా ఎంజాయ్ చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ఆయన ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నాడు. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. గతంలో రవితేజతో వీర సినిమా తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకుడు. 

More Related Stories