క్రాక్ టీజర్ టాక్ ... నువ్వు ఎవరైతే నాకేంట్రా...Ravi Teja Krack.jpg
2020-02-22 04:09:58

ఇటీవల డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో మాస్ మహరాజ్‌ రవితేజ క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇదివరకు తనకు రెండు బ్లాక్ బస్టర్లు అందించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో రవితేజ మూడోసారి కలిసి చేస్తోన్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జ‌న‌వ‌రి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా 'క్రాక్' మూవీ విడుదల తేదీ ఫిక్స్ చేసి క్రాక్ సినిమాని మే 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈరోజు శివరాత్రి సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజ‌ర్‌ లో చానాళ్ళ తరువాత ర‌వితేజ వీర విహారం క‌నిపించింది. లుక్ ప‌రంగా చూస్తే విక్రమార్కుడు విక్రమ్ రాథోడ్‌ ని దింపేసినా మలినేని మేకింగ్ మార్క్ కనిపిస్తోంది. 'ఒంగోల్‌లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆకట్టుకుంది. అప్పిగా, అప్పిగా, సుబ్బిగా నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా... అంటూ తనదైన మ్యానరిజంతో రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది.

స‌ముద్రఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ ఫుల్ పాత్రల్లో న‌టిస్తున్న ఈ సినిమాకి ఈ టీజర్ మరింత అంచనాలు పెంచేదిగా ఉన్నదని చెప్పక తప్పదు. సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ మీద మధు నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

More Related Stories