జాతీయ స్థాయిలో క్రిష్ ఎదుగుద‌ల‌..2017-04-01 14:17:58

క్రిష్ ఇప్పుడు మామూలు ద‌ర్శ‌కుడు కాదు.. ఆయ‌న పేరు ఇప్పుడు బ్రాండ్ మాదిరి అయిపోయింది. మొన్న‌టి వ‌ర‌కు మామూలు ద‌ర్శ‌కుడిగానే ఉన్నా.. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో మ‌నోడి రేంజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. బంగారం ధ‌ర‌ల్లా ఆకాశంలో కూర్చున్నాడు ఈ అంజ‌నీపుత్రుడు.  ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా క్రిష్ కు రాచ మ‌ర్యాద‌లు అందుతున్నాయి. ఇప్ప‌టికే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ మ‌ణిక‌ర్ణిక సినిమాను డైరెక్ట్ చేయ‌మ‌ని స్వ‌యంగా కంగ‌నా ర‌నౌతే క్రిష్ ను అడుగుతోంది. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డులు ఇచ్చే రేంజ్ కు క్రిష్ ఎదిగిపోయాడు. ఏంటి ఈ చిత్రం అనుకుంటున్నారా..? అవును.. ఇది నిజంగా చిత్ర‌మే.. జాతీయ అవార్డుల క‌మిటీలో క్రిష్ కూడా భాగం అయ్యాడు. ఈయ‌న్ని జ్యూరి మెంబ‌ర్ గా తీసుకుంది. ఓ తెలుగు ద‌ర్శ‌కుడికి ద‌క్కిన అరుదైన గౌర‌వం ఇది. మొత్తానికి క్రిష్, రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుల పుణ్య‌మా అని ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ జెండా బాలీవుడ్ లో రెప‌రెపలాడుతుంది. 

More Related Stories