ఫ్యాన్స్ నందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా



krish
2021-04-05 11:55:55

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు.  దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ...ఫ్యాన్స్ నందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా అంటారు. లంచ్ టైమ్ లో షూటింగ్ జరుగుతుంది. ట్విట్టర్ ఓపెన్ చేశాను ఏం న్యూస్ వచ్చిందని, అందులో ఒక మెసేజ్ అభిమాని పంపింది ఉంది. అందులో ఎండ బాగుంది, మా హీరోను బాగా చూసుకోండి అని పంపారు. మనకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఫెస్టివల్ మొదలవబోతోంది. అందులో వకీల్ సాబ్ శుభారంభం చేయబోతోంది. 

ఇలాంటి గొప్ప ఇతివృత్తమున్న చిత్రాన్ని పవన్ గారి దగ్గరకు తీసుకెళ్లిన నిర్మాత దిల్ రాజు గారికి శతకోటి వందనాలు. ఇది చెప్పాల్సిన కథ. ఇందుకు సెన్సబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణును తీసుకోవడం మరో మంచి డెసిషన్. పవన్ గారు తనకున్న సుప్రీమ్ పవర్ స్టార్ అయినా, తనకన్నా ఇతర పాత్రలకు కథలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా, తనకున్న ఇమేజ్ పక్కన పెట్టి  ఇది నేను చేయాల్సిన సినిమా అని వకీల్ సాబ్ మన ముందుకు తెచ్చిన పవర్ స్టార్ గారికి ఓయ్ వేసుకోండి. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ కోరుతున్నా. అన్నారు.

More Related Stories