దొంగగా మారుతున్న పవన్ కళ్యాణ్pk
2019-12-24 02:59:48

రాజకీయాల్లో బిజిబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో ఫిబ్రవరి నుంచి పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. క్రిష్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట. ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తారని అంటున్నారు. జానపద నేపధ్యంలో తెరకెక్కే ఈ సినిమా బడ్జెట్ దాదాపు వంద కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యంలా ఈ సినిమా కోసం కూడా ఒక రాజ్యాన్ని నిర్మిస్తారని అంటున్నారు. పెద్దపెద్ద రాజదర్బార్లు, కోటలు.. గుర్రపు స్వారీ లు, కత్తి యుద్దాలు ఇందులో కనిపిస్తాయట. ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అంతే కాక ఈ సినిమాలో ప‌వ‌న్ దొంగ‌గా క‌నిపిస్తాడని అంటున్నారు. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ అని అంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం సెట్స్ వేయాలని ఆది చాలా సమయం పట్టవచ్చని అంటున్నారు. అంతేకాక ఈ సినిమాకి దొంగ అనే అర్థం వ‌చ్చే టైటిల్ కోసం కూడా కష్ట పడుతున్నారట మేకర్స్. 

More Related Stories