`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సెట్లో హీరోయిన్ కృతిశెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.Krithi Shetty birthday celebrations
2021-09-21 21:56:58

`సమ్మోహనం`, `వి` చిత్రాల త‌ర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో రూపోందుతోన్న మూడో చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ రోజు హీరోయిన్ కృతి శెట్టి పుట్టిన‌రోజు కావ‌డంతో లొకేష‌న్ లోనే కృతిశెట్టి బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపారు చిత్ర యూనిట్‌. 

ఈ కార్య‌క్ర‌మంలో ఎంటైర్ టీమ్ పాల్గొంది. గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ఫ‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకం పై బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేష్‌. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. అవ‌స‌రాల‌ శ్రీ‌నివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

More Related Stories