జాతిరత్నాలు సినిమాకు కేటీఆర్ రివ్యూ KTR
2021-04-12 13:28:21

టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి యంగ్ డెరెక్టర్ అనుదీప్ కేవీల కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా జాతిర‌త్నాలు.  ఎన్నో అంచ‌నాల మ‌ధ్య మార్చి 11న విడుద‌లై అoచ‌నాల‌కు మించిన విజ‌యం సాధించింది. సినిమాకు మార్నింగ్ షోతోనే సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. అంతే కాకుండా థియేట‌ర్ లో ఈ సినిమా న‌వ్వులు పూయించింది. క‌రోనా భ‌యంతో ఉన్న ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా క‌డుపుబ్బా న‌వ్వించింది.

ఇక ఇప్పటికే ఈ సినిమాపై పలువురు నటీనటులు..దర్శక నిర్మాతలు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ఎప్రిల్ 11న జాతిరత్నాలు చూసిన కేటీఆర్ సినిమా భాగుందని పేర్కొన్నారు..అంతే కాకుండా హిళేరియస్ ఫన్ అంటూ రివూ ఇచ్చారు. ఇక కేటీఆర్ టాలీవుడ్ లో మంచి సినిమాలను ప్రశంసించడంలో ముందుంటారు. ఇప్పటికే పలు సినిమాలపై ప్రశంసలు కురిపించగా తాజాగా జాతిరత్నాలు సినిమా చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

More Related Stories