కేటీఆర్ గారూ మమ్మల్ని కరుణించండి అంటున్న అనసూయ...Anasuya.jpg
2020-03-23 09:18:46

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే పరిస్థితి తీవ్రతను అర్థం అయ్యేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 31 వరకు లాక్ డౌన్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. అంటే అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎవరూ ఇంటి నుంచి బయటికి అడుగు తీసి పెట్టరాదన్నమాట. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆయా కంపెనీలు ఈ వారం రోజులకు గానూ జీతం చెల్లించాలని సూచించారు ముఖ్యమంత్రి. అత్యవసర పరిస్థితులు.. నిత్యవసర సరుకుల విషయంలో మాత్రమే బయటికి రావాలని.. అది కూడా ఇంటికి ఒక్కరు మాత్రమే రావాలని ఆదేశించారు. ఇది ఎవరూ అతిక్రమించొద్దు అంటూ వేడుకున్నాడు కూడా. ఈ వారం రోజులు ట్రాన్స్ పోర్ట్ కూడా ఏదీ ఉండదు.

కరోనా వైరస్ నిలిపేయాలంటే.. దాన్ని అరికట్టాలంటే ఇదొక్కటే మార్గమని సూచించారు కేసీఆర్. దీనిపై జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ భిన్నంగా స్పందించింది. ట్విట్టర్‌లో కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ కేటీఆర్ సర్.. ప్రభుత్వం చెప్పింది పాటించాలి.. కానీ కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం ఈ పద్దతులు సడలించండి.. మేం పని చేయకపోతే మాకు డబ్బులు రావు.. కానీ మేం మా ఇంటి రెంట్ కట్టుకోవాలి.. కరెంట్ బిల్లు కట్టుకోవాలి.. EMI భరించాల్సిందే.. నెలసరి బిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మాపై దయ చూపించండి అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అవును పాపం.. రోజు పని చేసుకుంటే కానీ పూట గడవని నిరుపేద అనసూయ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

More Related Stories