సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇంట తీవ్ర విషాదంKurasala Suresh
2019-07-11 14:44:50

సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు కురసాల సురేష్‌ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి మరణించారు. విజయవాడలో ఉంటున్న ఆయనకు ఈ ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు, అయితే డాక్టర్ లు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించక ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు. సురేష్ వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. కళ్యాణ్ కృష్ణ సోదరులు మొత్తం ముగ్గురు కాగా, పెద్దాయన ఈ మధ్యనే ఎమ్మెల్యేగా ఎన్నికయి జగన్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక రెండో ఆయనే ఈ సురేష్,  గతంలో విశాఖపట్నంలో ‘ఈనాడు’ రిపోర్టర్‌గా పని చేసిన అయన ఆ తర్వాత రోజుల్లో జర్నలిజం వృత్తిని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి బాగా సంపాదించారు. కళ్యాణ్ కృష్ణ సినీ దర్శకుడుగా నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం, నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమాలకు దర్శకత్వం వహించారు.  

More Related Stories