కేవీ ఆనంద్ మృతిపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సినీ ప్రముఖులు



 KV Anand
2021-04-30 12:14:35

కేవీ ఆనంద్(54) ఈ రోజు తెల్ల‌వారుఝామున చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మ‌రణించారు. ఆయ‌న మృతితో ప్ర‌తి ఒక్క‌రు షాక్‌కు గుర‌య్యారు. దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమల్లో విషాద చాయాలు నెలకొన్నాయి. మరోవైపు ఆయన మృతిపట్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం సంతాపం ప్రకటించారు.

‘కె.వి.ఆనంద్‌ మరణవార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన ఇకపై మన మధ్య ఉండరంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. అలాగే, దేవుడు ఆయన కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను’ - రజనీకాంత్‌

డైరెక్ట‌ర్ కేవీ ఆనంద్ ఇక లేర‌నే విషాద వార్త‌తో నిద్ర లేచాను. మంచి కెమెరామెన్, గొప్ప ద‌ర్శ‌కుడు, మంచి మ‌నిషిని కోల్పోయాం.మీరు ఎప్ప‌టికీ మా మ‌న‌సుల‌లోనే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ మిస్ అవుతూనే ఉంటాం. మీ కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని బన్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘మ్యాగజైన్‌ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని.. దర్శకుడిగా విభిన్న చిత్రాలు తెరకెక్కించిన కె.వి.ఆనంద్‌ మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన మరణం సినీరంగానికి ఓ పెద్ద లోటు’ - కమల్‌హాసన్‌

‘ఇకపై మీరు మా కంటికి కనిపించకపోవచ్చు. కానీ, మా హృదయాల్లో ఎప్పటికీ మీరు చిరస్మరణీయం. కె.వి.ఆనంద్‌ సర్‌.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ - మోహన్‌లాల్‌

More Related Stories