ఆ హీరోల పేర్లు వింటే నాకేదో అయిపోతుంది



 Lakshmi Manchu
2020-11-28 15:46:54

సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీగా ఉంటూ ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగా వుండే నటి మంచు లక్ష్మి. మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించింది. బుల్లి తెరపై పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తాజగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పెళ్లయ్యిందని తెలిసి ఏడ్చేశానని చెప్పింది. అమీర్ ఖాన్ కు తను పెద్ద ఫ్యాన్ అని ఆయన పెళ్లయ్యిందని ఏడ్చేశా అని చెప్పింది. అంతే కాకుండా అమీర్ రెండో పెళ్లయ్యాక కూడా ఏడ్చినట్టు తెలిపింది. అమీర్ ఖాన్ సినిమాలంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఇక తెలుగు సినిమా హీరోల విషయానికొస్తే తనకు నాగార్జున అంటే ఇస్తామని చెప్పింది. అమీర్, నాగ్ ల పేర్లు వింటే తనకు ఏదోలా అవుతుందని చెప్పింది. ఇక మంచువారమ్మాయి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Related Stories