రాశీ లంక ఎలా ఉంది.. టాక్ ఏంటి..? Lanka-Movie-Preview
2017-04-17 09:36:04

రాశీ.. 90ల్లో తెలుగు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసిన బ్యూటీ. తెలుగు ఇండ‌స్ట్రీని ఏలిన చివ‌రి తెలుగ‌మ్మాయి ఈమె. ఆ త‌ర్వాత ఎవ‌రూ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. స్టార్ హీరోల‌తో ఎక్కువ‌గా న‌టించ‌క‌పోయినా.. అప్ప‌టి కుర్ర హీరోలంద‌రితోనూ ఆడిపాడింది. ఇక హీరోయిన్ గా ఫేడ‌వుట్ అయిపోయిన త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో లంక సినిమాతో వ‌స్తుంది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌ముణిని న‌మ్ముకుని ఈ సినిమా చేసింది రాశీ. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎప్రిల్ 21న లంక విడుద‌ల కానుంది.

సెన్సార్ బోర్డ్ యు బై ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఇందులో రాశీ న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని.. సినిమాకు ఈమె ప్ల‌స్ పాయింట్ అని తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా వ‌చ్చింద‌ని.. అయితే ఓవ‌రాల్ గా నార్మ‌ల్ హార్ర‌ర్ పిక్చ‌రే అని స‌మాచారం. సినిమా విజ‌యావ‌కాశాలు ఎలా ఉన్నా.. ఈ సినిమాతో క‌చ్చితంగా రాశీ సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోతుంద‌ని చెబుతున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. త‌న సెకండ్ ఇన్నింగ్స్ కు ప‌ర్ ఫెక్ట్ రీ లాంఛ్ లా లంక ఉంటుంద‌ని రాశీ కూడా ఆశిస్తుంది. చూడాలిక‌.. ఈమె ఆశ‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేరుతాయో ఎప్రిల్ 21న తేల‌నుంది.